వైకాపా అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా..ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోలేదని..భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. పార్టీ విస్తరణలో భాగంగా ఆమె అనంతపురంలో పర్యటించారు. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలనే కేంద్రం సూచించిందని స్పష్టం చేశారు. పనులు ఆపేయాలని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడం వల్ల పారిశ్రామిక పెట్టుబడులు వెనక్కివెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్త ఇసుక విధానమంటూ..నిర్మాణ రంగాన్ని స్తంభింపజేశారని ఆరోపించారు. భాజపా నేతలపై వైకాపా కార్యకర్తలు చేస్తున్న దాడులను ఇకనైనా ఆపాలని కోరారు.
పోలవరం పనుల్ని ఆపమని కేంద్రం చెప్పలేదే..?
మూడు నెలల పాలనలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి క్రియాశీల, విధానపర నిర్ణయాలు తీసుకోలేదని.. భాజపా నేత పురందేశ్వరి విమర్శించారు. పోలవరం పనులను కేంద్రం ఆపేయమని చెప్పలేదని స్పష్టం చేశారు.
పోలవరం పనుల్ని ఆపమని కేంద్రం చెప్పలేదే..?