ప్రభుత్వం పేదలకు ఇవ్వదలచిన స్థలాలు గ్రామానికి దూరంగా ఉన్నాయని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామానికి దగ్గరలో స్థలాలు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. 54 సర్వేనెంబర్లో 11 ఎకరాల 93సెంట్లు భూమి ఉండగా.. అందులో 4.50సెంట్లు శ్మశాన వాటికకు గతంలోనే కేటాయించిందన్నారు. మిగులు భూమి ఏడెకరాల 43 సెంట్లు ఇంటి పట్టాలు మంజూరు కోసం రెవెన్యూ అధికారులు పరిశీలించగా సర్వే చేసేందుకు సిబ్బంది వచ్చారు. శ్మశాన వాటికకు దగ్గరగా ఇంటి స్థలాలు మాకొద్దంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'స్మశానంలో ఇంటి స్థలాలు మాకొద్దు' - రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్థుల వార్తలు
శ్మశానానికి దగ్గరగా ఇంటి స్థలాలు వద్దంటూ..గ్రామానికి దగ్గరగా ఇవ్వాలని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు.

రెవెన్యూ అధికారులను అడ్డుకున్న పులేటిపల్లి గ్రామస్థులు
రెవెన్యూ అధికారులను అడ్డుకున్న పులేటిపల్లి గ్రామస్థులు
ఇవీ చూడండి...