అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నేతలు.. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతిని బుధవారం నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం డివిజన్ కార్యదర్శి మల్లికార్జున కొనియాడారు. ఆయన జీవితకాలం ప్రజల మధ్యనే జీవిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేశారని కీర్తించారు. ఎమ్మెల్యే గాను, మరోసారి ఎంపీ గాను గెలిచినా ...సైకిల్ మీద పార్లమెంటు వెళ్లిన నిరాడంబరుడన్నారు.
రాయదుర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి - రాయదుర్గం వార్తలు
రాయదుర్గం పట్టణంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతిని నిర్వహించారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని పార్టీ డివిజన్ కార్యదర్శి మల్లికార్జున కొనియాడారు.
రాయదుర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి
ఆయన సేవా కార్య క్రమాలను ఆదర్శంగా తీసుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా.. కరోనా బారినపడన రోగులకు పార్టీ కార్యాలయాలను ఐసోలేషన్ వార్డులుగా మార్చి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నమన్నారు. ఇదే సుందరయ్యకి ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.
ఇదీ చదవండికర్నూలు సీపీఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి