ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలి'

అనంతపురం జిల్లా కడవకల్లు గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని... కనీస వేతనం రూ. 600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు నెలలపాటు కూలీలకు రూ. 7500 ఇవ్వాలని కోరారు.

Public unions have protested against providing employment guarantees for all workers at kadavakallu in ananthapuram district
Public unions have protested against providing employment guarantees for all workers at kadavakallu in ananthapuram district

By

Published : Jun 4, 2020, 6:56 PM IST

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో కరోనా లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాసంఘాల నాయకులు.... గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేశాయి. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ సిబ్బందికి అందజేశారు.

ప్రతీ కుటుంబానికి 3 నెలలు పాటు నెలకు రూ. 7500 ఇవ్వాలని కోరారు. జాబ్ కార్డులు లేని వారందరికీ కార్డులు ఇచ్చి.. కుటుంబానికి 200 పని దినాలు, రూ. 600 వేతనం ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తూ చనిపోయిన వారికి రూ.25 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని సీపీఎం మండల కార్యదర్శి రామాంజనేయులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details