అనంతపురంలోని 43వ డివిజన్లో స్థానిక తెదేపా నేతలు.. ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర వస్తువులు అందించారు. మాజీ కార్పొరేటర్ సరళా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వస్తువులను పంపిణీ చేశారు. పాపంపేట గ్రామ సమీపంలో మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
అనంతపురంలో పేదలకు నిత్యావసరాలు అందజేత - lockdown effect on people
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకొని తమ ఉదారతను చాటుకుంటున్నారు.
అనంతపురంలో పేదలకు నిత్యావసరాల అందజేత