అనంతపురం జిల్లా ధర్మవరంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు తారక్ చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు, ట్రస్ట్ నిర్వాహకుడు రామాంజి అతని మిత్ర బృందం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో చేనేత కార్మికులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి బియ్యం, గోధుమపిండి, కూరగాయలు తదితర నిత్యావసర సరకులను అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
ధర్మవరంలో చేనేత కార్మికులకు నిత్యావసరాలు అందజేత - lockdown
లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల కుటుంబాలకు తారక్ చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు.
ధర్మవరంలో చేనేత కార్మికులకు నిత్యావసరాలు అందజేత