అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ 19 ఫస్ట్ లైన్ వారియర్స్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలని రాయదుర్గం తాలుకా సీపీఐ కార్యదర్శి ఎం. నాగార్జున డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రోజుకు 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. కరోనా మరణాలు 1000 కి పైగా దాటాయని, కరోనా వ్యాప్తిలో 15వ స్థానంలో ఉన్న ఏపీ నాలుగు నెలల పరిధిలో 4 వ స్థానానికి చేరుకోవడం దారుణమని అన్నారు. ఆస్పత్రిలో, క్వారంటైన్ కేంద్రాలలో రోగులకు సరైన పౌష్టికాహారం అందటం లేదనే వార్తలు వస్తున్నాయని.. రోగులందరికీ సకాలంలో పౌష్టికాహరం అందించాలని కోరారు.