ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతల అండతో అక్రమాలకు పాల్పడుతున్నారు..'

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇళ్లపట్టాల పంపిణీ రసాభాసగా మారింది. కర్నూలు జిల్లాలో దేవాలయానికి చెందిన భూములు పంచుతున్నారంటూ స్థానికులు ఆందోళన చేశారు. మరోవైపు అనంతపురం జిల్లాలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లస్థలాలను ఇతరులకు పంచుతున్నారని నిరసన చేపట్టారు. వైకాపా నేతల అండతో ఇళ్లపట్టాల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని ధర్నా చేశారు.

protet in kurnool, ananthapuram districts to demand on house documents distribution
బ్రహ్మసముద్రం మండలం మాముడూరు గ్రామంలో ఆందోళన

By

Published : Dec 30, 2020, 7:58 PM IST

కర్నూలు జిల్లాలో...

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానికంగా దేవాలయ స్థలానికి డిమాండ్‌ ఉండటంతో... వీటికీ పట్టాలు సృష్టించి సొంతం చేసుకోవాలని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ భూముల్లోని ముళ్లకంపలు తొలగించి బండలు పాతారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆలయ పూజారి నెంబి రఘన్న... కబ్జాదారుల నుంచి భూములు కాపాడాలని కోరారు.

అనంతపురం జిల్లాలో...

అనంతపురం జిల్లా నార్పలలోని సీపీఐ కాలనీలో... గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ శింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఐ కాలనీ వాసులకు న్యాయం చేయాలంటూ... స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్పందించిన ఉప తహసీల్దార్... పేదలకు న్యాయం చేస్తామని అన్నారు.

శింగనమల గ్రామ పంచాయతీకి చెందిన పేదలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇతరులకు ఇస్తున్నారంటూ లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైకాపా నేతల అండతో స్థానిక కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. బ్రహ్మసముద్రం మండలం మాముడూరు గ్రామంలో 63 మంది లబ్ధిదారుల ఇళ్ల పట్టాలను అధికారులు తీసేసుకుని ఇతరులకు అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... లబ్ధిదారులతో సచివాలయం ఎదుట బైఠాయించారు.

ఇదీచదవండి.

ప్రొద్దుటూరులో నారా లోకేశ్ ఆందోళన.. స్థానిక ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details