రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి... ఉద్యోగులకు గులాబీ పూలను అందిస్తూ మద్దతు కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నినాదంతో అభివృద్ధిని విచ్ఛిన్నం చేస్తున్నారని పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. నెలన్నర రోజులుగా అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.
గులాబీలతో వినూత్న నిరసన... రాజధాని కోసమే..! - రాజధాని కోసం అనంతపురంలో నిరసన
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. వినూత్నంగా నిరసన చేస్తేనైనా ప్రభుత్వం స్పందిస్తుందని... అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఆలోచించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో గులాబీ పూలిచ్చి తమ నిరసనను తెలిపారు.
వినూత్న నిరసన.. గులాబీలతో.. రాజధాని కోసం