ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా కదిరిలో నిరసన - అమరావతి ఉద్యమంపై వార్తలు

అనంతపురం జిల్లా కదిరిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. రాజధాని రైతులకు మద్దతుగా కదిరిలో ప్రదర్శన నిర్వహించారు.

Protest in Kadiri in support of Amravati
అమరావతికి మద్దతుగా కదిరిలో నిరసన

By

Published : Oct 12, 2020, 8:27 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి మద్దతుగా తెదేపా, సీపీఐ, ముస్లిం, కాంగ్రెస్ పార్టీలు, అమరావతి పరిరక్షణ సమితి నిరసనన చేపట్టింది. రాజధాని రైతులకు మద్దతుగా కదిరిలో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 42వ నంబర్ జాతీయ రహదారిపై ర్యాలీగా వెళ్లారు. ప్లకార్డులు చేత పట్టుకొని ప్రదర్శనగా వెళ్లారు. అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో చేశారు.

రాజధాని రైతులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు విమర్శించారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు 300రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అలుపెరుగని అమరావతి ఉద్యమానికి 300 రోజులు

ABOUT THE AUTHOR

...view details