గత ప్రభుత్వం హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇంటి స్థల పట్టాలను రద్దు చేశామని, వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అనంతపురం గ్రామీణం మండలం అక్కంపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బెదిరింపుదారులపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను... స్థానిక వైకాపా కార్యకర్తలకు ఇచ్చేందుకు కుట్ర జరుగుతోందని బాధితులు ఆరోపించారు. పోలీసులు, జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేయని పక్షంలో జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై రెండో పట్టణ సీఐ విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆందోళనకారులు తెలిపారు.
'మా ఇళ్ల పట్టాలు వైకాపా కార్యకర్తలకు ఇచ్చే కుట్ర' - అనంతపురంలో ఆందోళన
అనంతపురంలో అక్కంపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను.. స్థానిక వైకాపా కార్యకర్తలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'మా ఇళ్ల స్థలాల పట్టాలను వైకాపా కార్యకర్తలకు ఇచ్చేందుకు కుట్ర జరుగుతోంది'