ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలనీలో సీసీ రోడ్లు వేయించాలంటూ స్థానికుల రాస్తారోకో - cc roads at malayanur

అనంతపురం జిల్లా మలయనూర్ గ్రామంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని దళితవాడలో సీసీ రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు.

protest for cc roads at malayanur
కాలనీలో సీసీ రోడ్లు వేయించాలంటూ స్థానికుల రాస్తారోకో

By

Published : Jan 10, 2021, 4:07 AM IST

గ్రామంలోని దళితవాడలో సీసీ రోడ్లు వేయాలంటూ.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూర్ గ్రామానికి చెందిన చిన్నారులు, యువకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, అధికారులు తమ విన్నపాలను ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా.. కాలనీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డెక్కి రాస్తారోకో చేసే హక్కు లేదని పోలీసులు యువకులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details