రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు చేతికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేయటంపై సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా గుత్తిలో గాంధీ కూడలి వద్ద చేతులకు తాళ్లతో స్వయంగా నిర్బంధించుకుని వినూత్న నిరసన చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. వారిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మిత్ర పక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు.
రైతులకు సంకెళ్లు వేయటంపై సీపీఐ నాయకుల వినూత్న నిరసన - cpi latest news
అనంతపురం జిల్లా గుత్తిలో గాంధీ కూడలి వద్ద సీపీఐ నాయకులు వినూత్న నిరసన చేశారు. అమరావతి రైతుల చేతికి సంకెళ్లు వేసి అరెస్టు చేయటం సిగ్గుచేటు అంటూ ఆందోళన నిర్వహించారు.
![రైతులకు సంకెళ్లు వేయటంపై సీపీఐ నాయకుల వినూత్న నిరసన Protest by CPI leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9386083-846-9386083-1604194911261.jpg)
సీపీఐ నాయకుల నిరసన
ఇదీ చదవండి:
రైతులకు సంకెళ్లపై ఎన్హెచ్ఆర్సీకి ముప్పాళ్ల ఫిర్యాదు