ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెల్లని ఓటు వైకాపా ఖాతాలో వేశారంటూ తెదేపా అభ్యర్థి అందోళన - కదిరి మున్సిపాలిటీ ఉద్రిక్తత

కదిరి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓటు వైకాపా ఖాతాలో వేసి ఆ పార్టీని విజేతగా ప్రకటించారంటూ తెదేపా అభ్యర్థి ఆందోళన చేపట్టారు.

protest
చెల్లని ఓటు వైకాపా ఖాతాలో వేశారంటూ తెదేపా అభ్యర్థి అందోళన

By

Published : Mar 14, 2021, 4:44 PM IST

అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 29వ వార్డులో చెల్లని ఓటును వైకాపా ఖాతాలో వేస్తూ ఆ పార్టీ గెలిచినట్లు ప్రకటించారని తెదేపా అభ్యర్థి ఇర్ఫాన్ కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు . తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కందికుంట వెంకట ప్రసాద్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తెదేపా నేతను లెక్కింపు కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారంటూ వైకాపా శ్రేణులు ప్రశ్నించాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details