స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. రాజధానిని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి రైతుల ఆందోళనలు 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా... పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి సంఘీభావం తెలిపారు. వైకాపా కక్షసాధింపు చర్యలకు రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అమరావతినే రాజధాని కొనసాగించి.. అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
'స్వార్థ రాజకీయాల కోసం మూడు ముక్కలు చేస్తున్నారు' - puttaparthi news updates
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో నల్ల బ్యాడ్జీలు ధరించి అమరావతి రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు.
మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పుట్టపర్తిలో ఆందోళన