మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. వెనుకబడిన తరగతులకు చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ ద్వారా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీస్తారనే ఉద్దేశంతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా రాస్తారోకో - అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా కదిరిలో నిరసనలు
రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా కదిరిలోని తెదేపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా రాస్తారోకో