ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధి కోల్పోయిన వారికి రూ.పది వేలు అందించాలి' - గుంతకల్లు నేటి వార్తలు

ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.పది వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లులో సీపీఐ నేతలు మౌనదీక్ష చేశారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు.

protest against government rules in giddaloor anamthapuram district
గుంతకల్లులో సీపీఐ నేతల నిరసన

By

Published : May 5, 2020, 9:57 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.పదివేలు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. పట్టణంలో పనులు చేస్తూ జీవనం సాగించే కూలీలు, కార్మికులు ఉపాధి లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందునe... వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే నివసిస్తున్న కాలనీని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించడం అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులను ఆదుకునే వరకు మౌన దీక్షలు విరమించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details