ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్​ ధరల పెంపుపై అనంతపురంలో వినూత్న నిరసన - Anantapur district newsupdates

వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో వినూత్న నిరసన చేశారు. కేంద్రంలోని భాజపా వంటగ్యాస్ ధరలు 4 సార్లు పెంచి.. సామాన్యుల నడ్డి విరిచిందని, ఎవరి ప్రయోజనం కోసం ఈ ధరల పెంపు అని ప్రశ్నించారు.

Protest against gas price hike in Anantapur
అనంతపురంలో గ్యాస్​ ధరల పెంపుపై వినూత్న నిరసన

By

Published : Mar 2, 2021, 3:39 PM IST

వంట గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో వినూత్న నిరసన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేయాలని సిద్ధమైన.. కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు.. అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ కార్యలయం ఎదుటే రహదారిపై వంట వార్పు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు డా.శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై వంటచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. వంటగ్యాస్ ధరలు 4 సార్లు పెంచి.. సామాన్యుల నడ్డివిరుస్తున్న భాజపా ప్రభుత్వం.. ఎవరి ప్రయోజనం కోసం ధరలు పెంచుతుందో సమాధానం చెప్పాలని శైలజనాథ్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:ఉభయతారకంగా నదుల అనుసంధానం: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details