కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎస్ఎఫ్ఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి మోకాళ్ల పైన కూర్చుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశ రక్షణ విభాగంలో ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారని .. యథావిధిగా పాత పద్ధతుల్లోనే పరీక్షలు నిర్వహించి నియామకాలను చేయాలన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోవాలని లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.