అనంతపురం జిల్లా పెనుకొండలోని బాబాఫక్రిద్దిన్ స్వామి దర్గాలో.. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. పెనుకొండ బాబయ్య స్వామి దర్గా పీఠాధిపతి సయ్యద్ తాజ్ బాబా ఆధ్వర్యంలో.. ముస్లిం మతస్థులు వైభవంగా పండుగను జరుపుకున్నారు. ప్రవక్త గుర్తు(ఆయన మీసంలోని వెంట్రుక)ను భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంచారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు వేడుకల్లో పాల్గొని.... ఆయన గుర్తును దర్శనం చేసుకున్నారు. మాస్కులేని వారికి అనుమతి నిరాకరిస్తూ.. భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
పెనుకొండలో భక్తి శ్రద్ధలతో మిలాదున్నబీ వేడుకలు - పెనుకొండ బాబఫక్రిద్దిన్ దర్గాలో మిలాదున్నబి
మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. అనంతపురం జిల్లా పెనుకొండలో ఘనంగా జరిగాయి. మహిళలు, యువకులు భక్తి శ్రద్ధలతో ప్రవక్త గుర్తును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబయ్య స్వామి దర్గా పీఠాధిపతి సయ్యద్ తాజ్ బాబా భక్తులకు సందేశమిచ్చారు.
పెనుకొండలో మిలాదున్నబి వేడుకలు
TAGGED:
milad un nabi at penukonda