అనంతపురం జిల్లా కదిరిలో పడమర ప్రాజెక్టు పరిధిలో పసిపిల్లలకు, గర్భవతులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని సిబ్బంది, గుత్తేదారులు పక్కదారి పట్టించారన్న ఆరోపణల నేపథ్యంలో సరుకుల పంపిణీలో అవకతవకలపై రెండు రోజులుగా విచారణ సాగుతోంది. బాలసంజీవని, బాలామృతం, కొడిగుడ్లు పంపిణీలో జరిగిన అవకతవకలపై ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మయాదేవి విచారణ చేపట్టారు.
సరుకుల పంపిణీకి సంబంధించిన అక్విటెన్స్ రిజిస్టర్ లో నమోదు చేయకుండా పంపిణీ చేసినట్టు గుర్తించారు. అంగన్వాడీ కార్యకర్తల బిల్లులకు సంబంధించి వ్యత్యాసాలు ఉన్నట్టు బయటపడినట్టు పీడీ చిన్మయదేవి తెలిపారు.
సరుకుల పంపిణీపై ఐసీడీఎస్ అధికారుల విచారణ - kadiri
కదిరిలో సరుకుల పంపిణీలో అవకతవకలపై రెండు రోజులుగా ఐసీడీఎస్ అధికారుల విచారణ కొనసాగుతోంది.
సరుకుల పంపిణీపై ఐసీడీఎస్ అధికారుల విచారణ
ఇది కూడా చదవండి.