అనంతపురం జిల్లా మడకశిరకు ఝార్ఖండ్, బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. తమను స్వస్థలాలకు పంపాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రీన్ జోన్లో ఉన్న వలస కూలీలను తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ... తమ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు.
తిండి లేక.... చేతిలో డబ్బులు లేక తమ వారు పంపుతున్న డబ్బుతో జీవిస్తున్నామని ఇక్కడి వలస కూలీలు చెబుతున్నారు. తమకు కరోనా పరీక్షలు నెగిటివ్ వచ్చినా... అధికారులు తమను ఇక్కడే ఉంచారని వాపోతున్నారు. కన్నవాళ్లకు కొందరు.. కడుపున పుట్టినవాళ్లకు మరికొందరు... కట్టుకున్న భార్యకు ఇంకొందరు.. ఇంకా దూరంగా ఉండి బతకలేమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.