ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గంలో ఇళ్ల స్థలాల వివాదం..ఎన్నెన్నో మలుపులు - anantapur dst housing lands issue

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో రోజుకో సమస్య ఎదురవుతోంది. ఆ భూమి తమదంటే తమదని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. అధికారులు మాత్రం ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తి రికార్డులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

problems in govt alnds in anantapur dst kalayanduragam
problems in govt alnds in anantapur dst kalayanduragam

By

Published : Jul 22, 2020, 2:46 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీపై అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కళ్యాణదుర్గం శివార్లలోని ముదిగల్లు రోడ్డుకు 11 ఎకరాల భూమిని తీసుకుని పేదలకు పంపిణీ చేసేందుకు ప్లాట్లు సిద్ధం చేశారు.

ఈ భూమిపై హక్కు తమకు ఉందని కొంతమంది అడ్డుపడ్డా అధికారులు వాటిని అధిగమించి ప్లాట్లు సిద్ధం చేశారు. ఈ భూమి తమకు హక్కు ఉందని తాజాగా కొంతమంది ట్రాక్టర్లతో వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్ గోపాల్ రెడ్డిని అడగగా ఆ భూమి కొనుగోలు చేశామని హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.

ఇదీ చూడండి

విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్​లో ఎందుకు చేరలేదు'

ABOUT THE AUTHOR

...view details