అనంతపురం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఫిరంగిపురం మండలం మెరికపూడి వద్దకు రాగానే బ్రేక్స్ ఫెయిల్ అయి అదుపుతప్పి లంకలోకి బస్సు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్లో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా అందరు క్షేమంగా బయట పడ్డారు. ఒకరికి మాత్రం కొద్దిపాటి గాయాలు అవ్వగా 108 వాహనం ద్వారా నరసరావుపేటలోని ప్రైయివేట్ వైద్యశాలకు తరలించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా.. తప్పిన ఘోర ప్రమాదం - Bus overturns at Merikapudi
బ్రేక్స్ ఫెయిల్ అయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడ్డారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా