అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో నాగప్ప ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటినుంచి ఉపాధి లేక, ఇతర పనులు దొరకక మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం - ధర్మవరం నేర వార్తలు
కరోనా ప్రభావంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం