ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మరో అడుగు ముందుకేశారు. అనంతపురం - బళ్లారి జిల్లాల సరిహద్దులను జీపీఎస్‌తో అనుసంధానం చేయడానికి రాయదుర్గం నియోజకవర్గంలోని డి హిరేహాల్ మండలం ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో రెండు రోజులుగా డ్రోన్లతో సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా సర్వే చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీపీఎస్‌తో అనుసంధానం పూర్తయిన అనంతరం వీటిని అంగీకరిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలకు చెందిన నోడల్ అధికారులు సంతకాలు చేయటం ద్వారా ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు వివాదానికి తెరపడనుంది.
సరిహద్దు వివాదాల పరిష్కారానికి సన్నాహాలు - andhra karnataka border latest news
త్వరలో ఆంధ్ర - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వివాదానికి తెరపడనుంది. అనంతపురం - బళ్లారి జిల్లాల సరిహద్దులను జీపీఎస్‌తో అనుసంధానం చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా అధికారులు డ్రోన్లతో సర్వే నిర్వహిస్తున్నారు. జీపీఎస్‌తో అనుసంధానం అనంతరం ఇరు రాష్ట్రాల నోడల్ అధికారుల సంతకాలతో ఈ వివాదానికి తెరపడనుంది.
గతంలో ఇక్కడ ఇనుప ఖనిజం తవ్వకాలు కారణంగా సరిహద్దు రాళ్లు చెదిరి పోయాయి. దీంతో ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. రెండు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివాదం పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. దీంతో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, బళ్లారి జిల్లా కలెక్టర్ నకుల్‌ను నోడల్ అధికారులుగా నియమించారు. ఇరు రాష్ట్రాల అధికారుల వద్ద ఉన్న భూ సరిహద్దు రికార్డులు, గ్రామ పటాల ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సమక్షంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఇప్పటివరకు 76 సరిహద్దులను ఏర్పాటు చేశారు. వాటిని డ్రోన్ల సహాయంతో జీపీఎస్‌కు అనుసంధానం చేసే పనిని మార్చి 1 నుంచి సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ప్రారంభించారు.
ఇదీ చదవండిఆంధ్రా ప్యారిస్‌లో ఆసక్తిగా పురపోరు..!