ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రిలో చేర్చుకోని వైద్యులు.. సీహెచ్‌సీ బాత్‌రూమ్‌లో గర్భిణీ ప్రసవం - Ananthapuram

రాయదుర్గం సీహెచ్‌సీ బాత్‌రూమ్‌లో గర్భిణీ ప్రసవం
రాయదుర్గం సీహెచ్‌సీ బాత్‌రూమ్‌లో గర్భిణీ ప్రసవం

By

Published : Sep 25, 2021, 12:06 PM IST

Updated : Sep 25, 2021, 5:46 PM IST

12:04 September 25

ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని ఆస్పత్రిలో చేర్చుకోని వైద్యులు

రాయదుర్గం సీహెచ్‌సీ బాత్‌రూమ్‌లో గర్భిణీ ప్రసవం

ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళ బాత్​ రూంలోనే ప్రసవించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శనివారం జరిగింది. 

కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు

రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న హనుమంతు అనే వ్యక్తి భార్య లక్ష్మీ (28)ని కాన్పు కోసం స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సులు.. లక్ష్మీని పరీక్షించి బేబి బరువు తక్కువగా ఉందని చెప్పారు. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అయితే ఉన్నపలంగా వెళ్లమంటే ఎలా అని ఇక్కడే ప్రసవం చేయండి అంటూ.. గర్భిణీనిని బంధువులు ఆసుపత్రిలోనే ఉంచారు. అయితే లక్షీ కాలకృత్యం కోసం బాత్రూమ్​కు వెళ్లగా ఆమె అక్కడ జారి పడి మగబిడ్డను ప్రసవించింది. 

డ్యూటీ డాక్టర్​ ఉన్నప్పటికీ పట్టించుకోలేదని గర్భిణీ బంధువులు ఆరోపించారు. నర్సులు డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆసుపత్రి సూపరింటెండెంట్​​ డాక్టర్​ మంజువాణీకి ఫిర్యాదు చేశారు. 

"ప్రసవం కోసం లక్ష్మీని ఆసుపత్రికి తీసుకొచ్చాము. అయితే బిడ్డ బరువు తక్కువ ఉంది కాన్పు చేయడం కష్టమని నర్సులు అన్నారు. సంతకం పెట్టమని అన్నారు. అందుకు మేము ఒప్పుకోలేదు. అయితే లక్ష్మీ బాత్​రూం లోకి వెళ్లిగా అక్కడే ప్రసవించింది."

 -మల్లమ్మ, లక్ష్మీ కుటుంబ సభ్యురాలు

"కాన్పు కోసం లక్ష్మీ ఆసుపత్రికి ఉదయం వచ్చింది. ఐదో కాన్పు కావడంతో హై రిస్క్ ఉంటుందనే ఉద్దేశంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి వెళ్లమని చెప్పాం. ఈ విషయంలో తమ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారని తేలితే చర్యలు తీసుకుంటాం." 

-మంజువాణి, రాయదుర్గం కమ్యూనిటీ వైద్యశాల,ప్రధాన వైద్యాధికారి

ఇదీ చదవండి:LAXMINARAYANA: 'పాఠశాల దశ నుంచే పిల్లలకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించాలి'

Last Updated : Sep 25, 2021, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details