అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని దేవి నర్సింగ్ హోమ్‌లో నీలిమ అనే గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నీలిమ మృతి చెందిందని కుటుంబ సభ్యులు సీపీఐ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. నెలలు నిండిన నీలిమను కుటుంబ సభ్యులు దేవి ఆస్పత్రికి తీసుకువచ్చారు. కోవిడ్ పరీక్షలు చేయించుకుని వస్తేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని ఆసుపత్రి సిబ్బంది వారికి తెలిపారు.
ఇందిరమ్మ కాలనీలో ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా... నెగిటివ్ ఫలితాలు వచ్చాయని కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. అయినా వారు నీలిమను చేర్చుకోవటంలో జాప్యం చేసిన కారణంగా... మృతి చెందినట్లు నీలిమ తల్లి రామలక్ష్మి ఆరోపించారు.