కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైరస్ నుంచి ప్రయాణికులను కాపాడటానికి స్టేషన్ పరిసరాలను ఎప్పటికపుడు డిటర్జెంట్ సబ్బులు, ఇతర సామగ్రిని ఉపయోగించి ప్లాట్ ఫామ్లను శుభ్రపరుస్తున్నారు. అధికారులు ఎప్పటికపుడు ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో రసాయన వాయువులు చల్లుతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 17 ప్రత్యేక రైళ్లను ఇప్పటికే నిలిపివేశారు. రద్దీగా ఉండే రైల్వే ఆట స్థలాలు, ఇన్స్టిట్యూట్, టెన్నిస్ కోర్ట్, వివాహ వేదికలు, పార్కులు మార్చ్ 31 వరకు మూసివేశారు. రైల్వే ప్లాట్ ఫామ్లపై రద్దీని తగ్గించడానికి టికెట్ ధర రూ.50 పెంచుతూ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు