రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలోని ఎర్రనేల కొట్టాల కాలనీలో తెదేపా శ్రేణులతో కలిసి చైతన్యయాత్ర నిర్వహించారు. పింఛన్లు, రేషన్ కార్డుల్లో అనర్హులని పేర్లు తొలగించిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తే, వైకాపా కక్ష సాధింపు ధోరణిలో అర్హులను అనర్హులని తేల్చడం సరికాదన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల్లో నుంచి తొలగించిన వారు జాబితాతో అన్ని పార్టీలతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని తెలిపారు.
'ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది' - మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తాజా వ్యాఖ్యలు
వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనంతపురం జిల్లాలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. పింఛన్లు, రేషన్ కార్డుల్లో అర్హులైన వారిని తొలగించారని, ఆ జాబితాతో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర