ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Power Disconnect in Ananthapur : జనాల ఇళ్లకో న్యాయం.. సర్కారు ఆఫీసులకో న్యాయమా? - అనంతపురం జిల్లాలో విద్యుత్ వినియోగం

"సాధారణ పౌరులు విద్యుత్ బిల్లు చెల్లించడం(If normal people don't pay Electricity bill power will cut) ఒక్కరోజు ఆలస్యమైతే చాలు వెంటనే జరిమానా విధించేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలు పడినా జరిమానాలు వేయకపోగా.. ఆ భారం వినియోగదారుల నెత్తినమోపుతారా?" అని ప్రశ్నిస్తున్నారు జనం. మరి, ఇదంతా ఎక్కడో చూడండి...

Power Disconnect in Ananthapur
విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఎందుకీ వివక్ష..?

By

Published : Nov 26, 2021, 5:10 PM IST

సాధారణ పౌరులు విద్యుత్ బిల్లు చెల్లించడం(If normal people don't pay Electricity bill power will cut) ఒక్కరోజు ఆలస్యమైతే చాలు వెంటనే జరిమానా విధించేస్తారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఎన్ని కోట్ల రూపాయలు బకాయి పడినా జరిమానాలు వేయకపోగా.. ఆ భారం సామాన్య వినియోగదారుల నెత్తినమోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ బకాయిలను వసూలు చేయలేని డిస్కంలు.. ప్రజలను మాత్రం బాదుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపు 2 వేల కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు రావాల్సి (Government offices crore rupees overdue of Electricity bill) ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి డిస్కంలు.

సామాన్యులు మాత్రం బిల్లు కట్టకపోతే జరిమానాలు, సరఫరా నిలిపివేయడం(Electricity supply) చేసే అధికారులు ...సర్కారు విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు( Electricity usage in Ananthapuram district Government office) వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించడం లేదు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోయినా ఏమీ చేయలేక కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయిన తర్వాత కనెక్షన్ తొలగిస్తున్నారు. జిల్లాలో ఎల్.టి, హెచ్.టి. ప్రభుత్వ విద్యుత్ సర్వీస్‌లు 14 వేల 453 ఉన్నాయి. వీటిలో వివిధ శాఖల కార్యాలయాలు, తాగునీటి పథకాలు, మున్సిపాలిటీలకు చెందిన కనెక్షన్లు ఉన్నాయి. ఎస్.పి.డి.సి.ఎల్.కు (SPDCL)ఈ సంస్థలన్నీ 19వందల 20 కోట్లు బకాయి పడ్డాయి. అయితే.. మితిమీరి బకాయిలు పడిన కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయా శాఖల అధికారులు స్పందించకపోవడంతో జిల్లావ్యాప్తంగా 1496 కనెక్షన్లు తొలగించారు.

అనంతపురం నగరపాలక సంస్థతో(Anantapur Municipal Corporation) పాటు 12 మున్సిపాలిటీల నుంచి విద్యుత్ సంస్థలకు 164 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. గ్రామీణ నీటి సరఫరా పథకం, సత్యసాయి తాగునీటి పథకం, విద్య, వైద్య, రెవెన్యూ, పోలీసు కార్యాలయాలన్నీ 12 వందల 85 కోట్ల రూపాయలు చెల్లించాలి. పోలీసు శాఖ కోటి రూపాయలకు పైగానే బకాయి పడింది. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలు 471 కోట్ల రూపాయలు చెల్లించలేదు. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, పురపాలికలకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. చేసేది లేక ఇటీవల పెనుకొండ నగర పంచాయతీ, కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ కనెక్షన్లు అధికారులు తొలగించారు. పెనుకొండ నగర పంచాయతీ 152 నెలల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని డిస్కంలు చెబుతున్నాయి.

అప్పులు చేసి అధిక వడ్డీలు చెల్లిస్తున్న విద్యుత్ డిస్కంలు ప్రభుత్వ బకాయిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిల విషయంలో ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. సామాన్యులకు ఓ న్యాయం, ప్రభుత్వానికి ఓ న్యాయం కాకుండా బిల్లు వసూళ్లలో అందిరినీ ఒకేలా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : CPI STATE SECREATARY RAMAKRISHNA: 'మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి..!'

ABOUT THE AUTHOR

...view details