Power Cut To Municipal Office : విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నగర పాలక సంస్థ కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. విద్యుత్ శాఖకు 96 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయంటూ.. ట్రాన్స్‌కో అధికారులు మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా ఆపేశారు. బకాయిలు చెల్లించలేదంటూ గత ఆరు నెలల కాలంలో కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఇది మూడోసారి. గత రెండు సార్లు అధికారులు పరస్పరం మాట్లాడుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేవారు. అయితే ఈసారి అలా కుదరదని ట్రాన్స్ అధికారులు స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి ఆదాయం లేని కారణంగానే బకాయిలు చెల్లించలేదని.. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Power Cut To Municipal Office : విద్యుత్ బకాయిలు చెల్లించని మున్సిపల్ కార్యాలయం...నిలిచిన సరఫరా ... - కల్యాణదుర్గం నగర పాలక సంస్థ కార్యాలయం
Power Cut To Municipal Office : విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నగర పాలక సంస్థ కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
విద్యుత్ బకాయిలు చెల్లించని మున్సిపల్ కార్యాలయం...నిలిచిన సరఫరా ...