Short Circuit In Guntakallu Govt Hospital: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంధకారం నెలకొంది. ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో సుమారు 3 గంటల పాటు కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు సెల్‌ఫోన్ లైట్లతో వైద్యులు చికిత్సలు అందించారు. ఈ ఘటనపై పలువురు రోగుల బంధువులు, వైద్యులను ప్రశ్నించగా వారు ఏమి పట్టనట్లు వ్యవహరించారు. వైద్య సిబ్బంది పై పలువురు రోగులు మండిపడుతున్నారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలోనే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటే ఎలా అని పలువురు రోగులు చర్చించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో చాలా సార్లు షార్ట్ సర్క్యూట్ జరుగుతున్న ఇటు అధికారులు గానీ అటు జిల్లా ఉన్నతాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని పలువురు రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్.. విద్యుత్ నిలిపివేత
Short Circuit In Guntakallu Govt Hospital: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంధకారం నెలకొంది. ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు రోగులు, వారి బంధువులు చర్చించుకుంటున్నారు.
Etv Bharat
విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు భయపడుతున్నారు. వైద్యులను అడుగుతుంటే మాకేమీ తెలియదన్నట్లుగా సమాధానం చేబుతున్నారు. దీనిపై ఉన్నాతాధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. - రోగి బంధువు
ఇవీ చదవండి