ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దానిమ్మ కాయల లారీ బోల్తా.. సుమారు లక్ష రూపాయల నష్టం! - కల్యాణదుర్గంలోలారీ ప్రమాదం

దానిమ్మ కాయల లారీ బోల్తా పడి సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిన ఘటన.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పరిధిలో జరిగింది.ఈ ఘటనలో దాదాపు 4 టన్నుల కాయలు పనికిరాకుండా పోయాయి.

pomogranate fruit lorry roll over in kalyanadurgam ananthapuram district
దానిమ్మ కాయల లారీ బోల్తా

By

Published : May 23, 2020, 8:52 PM IST

అనంతపురం కల్యాణదుర్గం ప్రధాన రహదారిలో దానిమ్మ కాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కాయలన్నీ రోడ్డు మీద పడి పాడైపోవటంతో సుమారు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు లారీ డ్రైవర్ చెప్పాడు. బెలుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి 4 టన్నుల దానిమ్మ కాయలు తమిళనాడు ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇందులో అధిక శాతం కాయలు పగిలిపోగా మరికొన్ని మార్కెట్ చేసుకోవడానికి వీలులేకుండా అయ్యాయి. అయితే కాయలు కొనుగోలు చేసి తమిళనాడు తరలిస్తున్న వ్యాపారి వివరాలు వెల్లడించేందుకు లారీ సిబ్బంది నిరాకరించారు.

ఇవీ చదవండి... తితిదే ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదు: టీజీ వెంకటేశ్

ABOUT THE AUTHOR

...view details