అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పది రోజులుగా తాగునీరు రాక పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. గురువారం వచ్చిన నీరు కలుషితంగా ఉండి తాగేందుకూ పనికి రాకుండా ఉందన్నారు.
ఈ నీటిని తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటూ ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. శుద్ధమైన నీటిని సరఫరా చేయాలన్నారు.