- వైద్యుల పట్ల నిర్లక్ష్యం.. బాధేస్తోంది: చంద్రబాబు
ప్రాణదాతలైన వైద్యుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధ కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విపత్కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి... ప్రజలకు వైద్య సేవలందిస్తున్న దేవుళ్లకి... జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులకు ఇంతవరకు వ్యక్తిగత రక్షణ దుస్తులు ఇవ్వకపోవటం… రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని చంద్రబాబు మండిపడ్డారు. పీపీఈల కోసం విశాఖ వైద్యులు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. మాస్క్లు అడిగిన పాపానికి డాక్టర్సు ధాకర్ను సస్పెండ్ చేసి... లాఠీలతో కొట్టి పిచ్చివాడనే ముద్ర వేశారని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలని చంద్రబాబు హితవు పలికారు.
- వైద్యుల సేవలను వైకాపా గుర్తించాలి: లోకేశ్
కుటుంబాలకు దూరంగా, ప్రాణాంతక కరోనాకి దగ్గరగా ఉంటూ విధి నిర్వహణే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్లందరికీ... జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైకాపా ప్రభుత్వం వారి సేవలను ఏమాత్రం గుర్తించకపోగా... అవమానాలకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వైద్యల సేవలను గుర్తించాలని డిమాండ్ చేశారు.
- కరోనా టైంలో వైద్యులకు అండగా నిలవాలి..: పవన్