భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో వర్షానికి(Crop damage with Heavy rains in Anantapur district) దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. రైతులను పరామర్శించటానికి వెళ్లిన చోట అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు, అధికారులు పంట నష్టం జరిగిన గ్రామాల్లో పర్యటించాలని కోరారు.
Leaders tour in Anantapur District : 'వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి' - palle ragunatha reddy tour in Anantapur District
అనంతపురం జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పర్యటించారు(CPI leader ramakrishna tour in garladinne). భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. వరద బాధితులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పరిహారం అందించాలి..
అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించకుండా.. లెక్కలతో నివేదికలు ఇచ్చారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి(Ex.Minister Palle Raghunatha Reddy) ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు నష్టం జరిగితే.. కేవలం వందల కోట్లలో నష్టం జరిగినట్లు నివేదికలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు, ఇల్లు దెబ్బతిన్న కుటుంబానికి రూ.50వేలు, వరద ప్రభావానికి గురైన ప్రతి కుటుంబానికీ రూ.పది వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీచదవండి.