అనంతపురం జిల్లా తాడిపత్రిలో చిరకాల ప్రత్యర్థులు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైకాపా నేత పెద్దారెడ్డిలు ఎదురెదురు పడ్డారు. తాడిపత్రి తెదేపా బరిలో ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఉండగా... పెద్దారెడ్డి వైకాపా తరపున పోటీ చేస్తున్నారు.
ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పెద్దారెడ్డి రూరల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అదే సమయంలో జేసీ అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరి తీరుపై మరొకరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపు రాకూడదంటూ ఇరు నేతలకు చెప్పటంతో... అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
తాడిపత్రిలో ఎదురుపడిన.. చిరకాల ప్రత్యర్థులు - వైకాపా పెద్దారెడ్డి
తాడిపత్రిలో చిరకాల ప్రత్యర్థులు జేసీ దివాకర్ రెడ్డి, వైకాపా నేత పెద్దారెడ్డిలు తారసపడ్డారు. చిన్నపాటి విమర్శలు చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ జోక్యం చేసుకుని వారించటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాడిపత్రిలో ఎదురుపడిన చిరకాల ప్రత్యర్థులు జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్జి
Last Updated : Apr 12, 2019, 7:04 AM IST