ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా హిందూపురంలో రోటరీ క్లబ్, ఆశా కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఐదు ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
'పోలియో రహిత సమాజమే లక్ష్యం'
హిందూపురం ప్రజల్లో అవయవ లోపాలకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కలిగించేందుకు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరిపారు. రోటరీ క్లబ్, ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
'పోలియో రహిత సమాజమే లక్ష్యం'