పుల్వామా దాడి జరిగి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా పొలికి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలోని అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న గ్రామానికి చెందిన జవాన్ల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, యువత అంతా కలిసి అమరజవాన్లకు అంజలి ఘటించారు. పొలికి గ్రామం నుంచి బీఎస్ఎఫ్ జవానుగా వెళ్లిన పవన్ కుమార్ ఆ రోజు జరిగిన సన్నివేశాల్ని విద్యార్థుల ముందు గుర్తు చేసుకున్నారు. పుల్వామా దాడి జరిగిన ప్రదేశంలో తాను ఆ రోజు విధులు నిర్వహించుకుని ఇంటికి వస్తుండగా తాను ప్రయాణిస్తోన్న బస్సు ముందుగా వచ్చేసిందని.. తన తోటి జవాన్లు మరో బస్సులో వస్తున్నారని.. ఇంతలోనే ఉగ్ర మూకలు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాయని తెలిపారు. తనతో పనిచేసి.. వీర మరణం పొందిన జవానులందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
పుల్వామా అమర జవాన్లకు.. పొలికి గ్రామస్థుల నివాళి - పుల్వామా అమర జవాన్లకు పొలికి గ్రామస్తులు నివాళి
పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు అనంతపురం జిల్లా పొలికి గ్రామస్థులు నివాళులర్పించారు. దేశ సరిహద్దులో పహారా కాస్తున్న పొలికి గ్రామంలోని జవాన్లు.... తమ అనుచరులకు సంఘీభావంగా విద్యార్థులతో కలిసి తమ సహచరుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.
![పుల్వామా అమర జవాన్లకు.. పొలికి గ్రామస్థుల నివాళి poliki village people tribute for Pulwama attack died armed forces, ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6077517-721-6077517-1581711765966.jpg)
పుల్వామా అమర జవాన్లకు.. పొలికి గ్రామస్తులు నివాళి
పుల్వామా అమర జవాన్లకు.. పొలికి గ్రామస్తులు నివాళి
Last Updated : Feb 15, 2020, 8:01 AM IST