ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారా స్థావరాలపై దాడులు... 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

అనంతపురం జిల్లా వజ్రకరూర్​ పోలీస్టేన్​ పరిధిలోని సారా స్థావరాలపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

polices rides on illegal cheap liquer stores at ananthapuram
నాటుసారా స్థావరాలపై దాడులు:1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Jun 21, 2020, 4:10 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని వెంకటపల్లి, బోడసానిపల్లి తండా సమీపంలోని సారా స్థావరాలపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఏఎస్పీ రామ్మోహన్​రావు, ఆయన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా సారా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రామ్మోహన్​ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details