Minor girl kidnap Case: అనంతపురం జిల్లాలో మైనర్ బాలిక అపహరణ కేసును గంట వ్యవధిలో పోలీసులు ఛేదించారు. హై అలర్ట్ మొబైల్ యాప్ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు.. బాలికను సురక్షితంగా కాపాడారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసినట్లు అనంతపురం దిశ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు డీఎస్పీ వెల్లడించారు. రాప్తాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తలిదండ్రులు కూలీ పనులు చేస్తుంటారు. ఇవాళ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను సమీప బంధువులైన సదానంద, అతని తండ్రి పుల్లన్న, కృష్ణ, కారు డ్రైవర్ బలవంతంగా తీసుకెళ్లారు. పని నుంచి తిరిగి వచ్చాక విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
మైనర్ బాలిక అపహరణ.. గంటలో ఛేదించిన పోలీసులు - బాలిక కిడ్నాప్ కేసుపై అనంతపురం దిశ డీఎస్పీ శ్రీనివాసులు ప్రెస్‌మీట్
police traced minor girl kidnap case: అనంతపురం జిల్లాలో ఓ మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. అయితే గంట వ్యవధిలోనే ఈ కేసును ఛేదించిన పోలీసులు.. ఆ బాలికను రక్షించారు. కేసులో నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
![మైనర్ బాలిక అపహరణ.. గంటలో ఛేదించిన పోలీసులు minor girl kidnap case in Anantapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15621571-1070-15621571-1655822446187.jpg)
ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్దరించారు. వెంటనే హై అలర్ట్ మొబైల్ యాప్ ద్వారా కిడ్నాప్‌నకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాలోని అన్ని స్టేషన్లకు పంపించారు. బృందాలను రంగంలోకి దిగిన పోలీసులు.. జిల్లాలోని తపోవనం సర్కిల్ వద్ద కారును గుర్తించారు. బాలికను రక్షించి, నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. బాలిక అపహరణ కేసును గంట వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను బాలిక బంధువులతోపాటు, ఉన్నతాధికారులు అభినందించారు. వివాహం చేసుకోవాలనే ఉద్దేశంలో బాలికను అపహరించేందుకు యత్నించినట్లు బాలిక సోదరుడు తెలిపారు.
ఇదీ చదవండి: