ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎం. కొత్తూరులో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎం. కొత్తూరులో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. మూడు లక్షల రూపాయల విలువైన 8,352 టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకుని .. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

By

Published : May 14, 2021, 6:47 PM IST

 m kotturu
పోలీసులు స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో ఎస్ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎం. కొత్తూరు సమీపంలోని ఓ మామిడితోటలో నిల్వఉంచిన 8352 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. మామిడి తోటను లీజుకు తీసుకున్న శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని సీఐ హరికృష్ణ తెలిపారు. ఈ దాడిలో సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 8,352 కర్ణాటక మద్యం టెట్రా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నామని.. ప్రకాష్, చిరంజీవి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details