అనంతపురంం జిల్లా చిలమత్తూరు మండలం పోలీసులు మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2400 కర్ణాటక మద్యం ప్యాకెట్లను.. ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
చిలమత్తూరులో 2400 ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టివేత - Karnataka liquor at chilamattur news
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు. 2400 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం ప్యాకెట్లు