అనంతపురం జిల్లా ఉరవకొండలోని 42వ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఇసుక డంప్ యార్డులో జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ రామ్మోహన్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇసుక అక్రమాలు జరగకుండా... 24 గంటలు గస్తీని ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే ఇసుకను తరలించాలన్నారు. ట్రాక్టర్ల ద్వారా ఎవరైనా ఇసుక తరలిస్తే.... వారి వద్ద సరైన అనుమతి పత్రాలు ఉన్నాయో? లేదో? చూడాలని.. ఆ తరువాతే అనుమతించాలని చెప్పారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇసుక డంప్ యార్డులో ఆకస్మిక తనిఖీలు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
ఇసుక డంప్ యార్డుల్లో అక్రమాలు జరగకుండా ఉండేందుకు అనంతపురం జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ రామ్మోహన్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా జరుగకుండా ఉండేందుకు 24 గంటలు గస్తీని ఉంచారు.
ఇసుక డంప్ యార్డులో ఆకస్మిక తనిఖీలు