అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుంతకల్లు పట్టణానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ల డ్రైవర్లని అదుపులోకి తీసుకుని.. వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్ఐ వలి బాషా తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాక్టర్ యజమానులన హెచ్చరించారు.
పెద్దొడ్డిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్ - పెద్దోడ్డిలో అక్రమంగా ఇసుక తరలింపు వార్తలు
అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దొడ్డిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
పెద్దోడ్డిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్