ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమిద్యాలలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత - అమిద్యాల తాజా వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు నిల్వ ఉంచుకొని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యు అధికారులు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

police seized rice at amidyala
అమిద్యాలలో రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Sep 22, 2020, 4:45 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో దాసరి వెంకటేశులు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచాడు. సోదాలు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు 46 బస్తాల చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశామని ఉరవకొండ ఎస్ఐ ధరణి బాబు తెలిపారు. బియ్యం బస్తాలు స్టాక్ పాయింట్​కు తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details