అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రెండు చోట్ల జరిపిన దాడుల్లో ఇరవై రెండు కర్ణాటక మద్యం బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుంగభద్రా ఎగువ కాలువపై మద్యాన్ని మోసుకెళ్తున్న తొమ్మిదిమందిని స్థానిక ఎస్సై, సీఐ సహకారంతో సిబ్బంది వెంబడించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. వారి నుంచి 15 బాక్సులు స్వాధీన పరచుకున్నామన్నారు. వీరందరూ నింబగల్లుకు చెందిన వారిగా గుర్తించామన్నారు.
ఉరవకొండలో కర్ణాటక మద్యం స్వాధీనం - karnataka liquor seized in uravakonda
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సరఫరాదారులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
![ఉరవకొండలో కర్ణాటక మద్యం స్వాధీనం police seized karnataka liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9227056-696-9227056-1603071262367.jpg)
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాక్సులు
చిన్న ముష్టూరు వద్ద నలుగురు వ్యక్తులు, ఏడు మద్యం పెట్టెలను పడేసి పరారవుతుండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
ఇదీ చదవండి: తాగుబోతు వీరంగానికి ఒకరు బలి