అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప, వెంకటాద్రిపల్లి పొలిమేర సమీపంలో 65 బస్తాల్లో ఉన్న సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆవులెన్నకు చెందిన గొర్రెల కాపరులు జీవాల మేతకోసం అటువైపు వెళ్లగా.. అక్కడ వంకలో బియ్యం సంచులను గుర్తించారు. వెంటనే గ్రామ సర్పంచికి సమాచారం అందించారు.
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం.. అక్కడ దాచిందెవరు? - రేషన్ బియ్యం
అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప, వెంకటాద్రిపల్లి పొలిమేర సమీపంలో.. సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దాచి ఉంచారు. పశువుల కాపరుల సమాచారం మేరుకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసకున్నారు.
రేషన్ బియ్యం
విషయాన్ని రెవెన్యూ, పోలీసులకు చేరవేయటంతో ఎర్రగుడి వీఆర్వో కీర్తి, పోలీసులు సురేష్, విజయ్ అక్కడికెళ్లి సుమారు 165 బస్తాల్లో ఉన్న సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడ లేరు. పేదల నుంచి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించాడానికి చెట్లపొదల్లో నిల్వ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:PDS Rice Seized : అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు.. 200 క్వింటాళ్లు సీజ్..