నిబంధనలకు విరుద్ధంగా పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని అనంతపురం జిల్లా విడపనకల్లు పోలీసులు పట్టుకున్నారు. కర్నాటకకు చెందిన పశువుల వ్యాపారి 11 ఎద్దులు, 3 దూడలు, ఒక గేదెను లారీలో అనంతపురానికి తరలిస్తుండగా అడ్డుకున్నారు.
విడపనకల్లు వద్ద 42 వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఈ వ్యవహారం బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. న్యాయస్థానం ఆదేశానుసారం పశువులను గోశాలకు తరలిస్తామని పేర్కొన్నారు.